- గచ్చిబౌలి డివిజన్ పోలింగ్ బూత్ కమిటీ సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడలో బీజేపీ కార్యాలయంలో బిజెపి బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో యువత, బిజెపి కార్యకర్తలు, నాయకులు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలపై బూత్ కమిటీ సభ్యులు చేపట్టవలసిన కార్యక్రమాలను, బిజెపి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బూత్ స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టడంతో పాటు బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ ను కలవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలని తెలిపారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికలు గెలవాలంటే బూత్ కమిటీల పనితీరు మెరుగ్గా ఉండాలని అభిప్రాయపడ్డారు. రెండు పార్టీల పాలనలో ప్రజలు విసిగిపోయి బిజెపి వైపు చూస్తున్నారు. ఈసారి జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు.

క్షేత్ర స్థాయిలో కష్టపడ్డ వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అలా కష్టపడ్డ వారిని బూత్ స్థాయిలో నియమించడం జరిగిందని తెలిపారు. పదవులు దక్కించుకున్న వారికి అభినందనలు తెలుపుతూ వారికి నియామక పత్రాలు అందజేశారు. ఓ బి సి మోర్చా అధ్యక్షుడు రాకేష్, ఉపాధ్యక్షుడు కులదీప్ సింగ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ సునీల్ సింగ్, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు శ్యామ్ రాథోడ్, ఉపాధ్యక్షుడు నర్సింగ్ నాయక్, జనరల్ సెక్రెటరీ శ్రీశైలం, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గోపాల్, జనరల్ సెక్రెటరీ సహదేవ్, ట్రెజరర్ సాయినాథ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు వంశీ గౌడ్, విక్రమ్ గౌడ్, జనరల్ సెక్రెటరీ విష్ణు, రాకేష్ గౌడ్, సెక్రెటరీ జ్ఞానేశ్వర్, ట్రెజరర్ సాయితేజలకు పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్ రాందీన్, మాదాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంత్ నాయక్, మాజీ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, సీనియర్ నాయకురాలు వరలక్ష్మి ధీరజ్, ఉదయలక్ష్మి, అసవరి, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, నరసింహారావు, సురేష్, అశోక్, సంజీవ, నరేందర్ ముదిరాజ్, నరేందర్ యాదవ్, శ్యామ్ యాదవ్, కిషన్ గౌలి, బబ్లూ సింగ్, దినేష్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి, సుమన్ , ప్రకాశ్, సామ్రాట్ గౌడ్, శ్రీను, రాజు, సీనియర్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





