శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలను నిర్వహించారు. హఫీజ్‌పేటలో స్థానిక హనుమాన్ యూత్ యువకుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






