బోనాల ఉత్సవాలకు రూ. 22.50 లక్షలు మంజూరు : ఆలయాల ప్రతినిధులకు ప్రభుత్వ విప్ గాంధీ చెక్కుల పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పర్వదిన సందర్భంగా బోనాలు వైభవంగా నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలకు నిధులు మంజూరు చేసిందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 73 దేవాలయాలకు ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 22.50 లక్షల నిధులను చెక్కుల రూపంలో దేవాలయాల కమిటీ ప్రతినిధులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు ,ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి సోమవారం ప్రభుత్వ విప్ గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గం లోని ప్రతి ఆలయానికి బోనాల నిధులు మంజూరయేలా కృషిచేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఈఓ అరుణ కుమారి,వివేకానంద నగర్ డివిజన్అధ్యక్షుడు సంజీవరెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు జిల్లా గణేష్, నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు,నాయకులు సాంబశివరావు, పోతుల రాజేందర్, కాశినాథ్ యాదవ్, రాంచందర్, ఆంజనేయులు, వాసు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఆలయ కమిటీ వారికి చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here