శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని హైదర్‌నగర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొల్లెపల్లి సీతారామ రాజు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని కొండాపూర్ మసీదుబండలో ఉన్న బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్ సమక్షంలో సీతారామ రాజు బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా సీతారామరాజుకు రవికుమార్ యాదవ్ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వల్లే అనేక మంది బీజేపీలో చేరుతున్నారని అన్నారు. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. సీతారామరాజు మాట్లాడుతూ హైదర్‌నగర్‌లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.






