నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని శంకర్ నగర్ కాలనీలో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ , చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి, అందరూ కాలుష్య నివారణకు పాటుపడాలని పేర్కొన్నారు. ప్రతిష్టించిన మట్టి వినాయకులను వారి వారి ఇంట్లో, కాలనీల లోనే నిమజ్జనం చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని నవతా రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో చందర్ రావు, రాజన్న, రామారావు, మానయ్య, సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, పోచయ్య, అనంత రెడ్డి, నాగ సత్యం, నెమలిగుండం, లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.