నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్లలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు, యూజీడీ పైపులైన్ నిర్మాణం పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పరిశీలించారు. నల్లగండ్ల గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇదివరకు ఉన్న పాత యూజీడీ లైన్ బ్లాక్ అవడంతో నూతనంగా యూజీడీ పనులను చేపట్టినట్లు గంగాధర్ రెడ్డి తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కృష్ణారెడ్డి, గిరి, మల్లికార్జున్, నందు, రాయుడు, మున్నూరు సాయి, నర్సింగ్ నాయక్, ప్రకాష్, మల్లేష్, రాజు, విజయ్ భాస్కర్ రెడ్డి, రాజు రెడ్డి, నవీన్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, అరవింద్ రెడ్డి, నరేందర్ నాయక్, గోవర్ధన్ నాయక్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.