అభివృద్ధి పనులు నిలిపివేయించినట్లు నిరూపించండి – నిరూపించకుంటే బేషరతుగా క్షమాపణ‌ చెప్పాలి – మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట లో అభివృద్ధి పనులను ఆపివేయించానని అనడం సిగ్గుచేటని, పదవులు ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసే వాళ్లమే తప్పా ప్రజలకు హాని కలిగించే వాళ్లం కాదని చందానగర్ మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకురాలు బొబ్బ నవత రెడ్డి అన్నారు. వేముకుంటలో మాజీ కార్పొరేటర్ అభివృద్ధి పనులు నిలిపివేయించారని ఆందోళన చేయించడం పట్ల ఆదివారం ఆమె స్వగృహంలో నవత రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఖండించారు. ఈ సందర్భంగా నవత రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై బీజేపీ నాయకులం ప్రశ్నిస్తుంటే ప్రస్తుత కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి వేముకుంటలో డ్రైనేజీ పనులు ఆపివేయించానంటూ తనపై కొంతమంది బీజేపీ వ్యతిరేక శక్తులతో ఆందోళన చేయించి నినాదాలు చేయించడం లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. అభివృద్ధి పనులు నిలిపివేయాలని చెప్పినట్లు ఏమైనా రుజువులు ఉంటే నిరూపించాలని, నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిరూపించకుంటే కార్పొరేటర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండి ప్రతిపక్షం వారు పనులు ఆపిస్తున్నారని సాకులు చెప్పడం సిగ్గుచేటన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

గత 15 రోజులుగా డివిజన్ లో పర్యటిస్తున్నామని, బురదమయమైన రోడ్లను వేయాలని చెబుతున్నాం దమ్ము దైర్యం ఉంటే నెల రోజుల్లో రోడ్లు వేయాలన్నారు. గుంతలమయమైన రోడ్ల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కమిషనర్ విడుదల చేసిన జీఓలో వర్షాకాలం రోడ్లు తవ్వకూడదని అధికారులే చెప్పి తిరిగి వాళ్లే కొత్తగా వేసిన రోడ్లను తవ్వడం ఎంత వరకు సమంజసమంటూ డివిజన్ లో తవ్విన రోడ్ల ఫోటోలు పెట్టామన్నారు. తాను ఎక్కడా అధికారులను పనులు ఆపమని కోరలేదని చెప్పారు. అదే విధంగా గత 6 నెలల క్రితమే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి వేసిన కొత్త రోడ్డు ను తిరిగి వారే విచ్చలవిడిగా తవ్వటం తద్వారా సుమారు 40 లక్షల రూపాయల ప్రజా దానం వృధా కావటం వారి తెలివితక్కువ ఆలోచనకు నిదర్శనమన్నారు. 18 నెలల కాలంలో వేముకుంట లో కార్పొరేటర్ గా ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ప్రస్తుత కార్పొరేటర్ కు దమ్ము ధైర్యం ఉంటే వేముకుంట లో నేను చేసిన అభివృద్ధి పై నువ్వు చేసిన అభివృద్ధి పై నాతో విలేకరుల ఎదుట చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వేముకుంటలో అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే క్షమాపణ చెప్తాను, దానికి మీరు నువ్వు దానికి సిద్ధమా అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాల క్రితం మహిళలను నమ్మించి ఒక చెల్లని చెక్కు ఇచ్చి, ఫోటోలకు ఫోజులిచ్చి, మహిళల ఓట్ల తో గెలిచిన ఎమ్మెల్యే మహిళలను మోసం చేసి గత 4 సంవత్సరాలుగా మహిళ భవనం పూర్తి చేయలేని విషయం వేముకుంట వాసులకు తెలుసన్నారు. పేద మైనారిటీ పిల్లలు చదువుకునే స్కూల్ లో ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ ఇప్పించలేని మీరు మమ్ములని విమర్శిస్తారా అని నవత రెడ్డి మండిపడ్డారు‌. ఇప్పటికైనా ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన కార్పొరేటర్ గా బయటికి వచ్చి ప్రజల ఇబ్బందులను అర్ధం చేసుకుని డివిజన్ లో ఉన్న పాడైన రోడ్లను నెల రోజుల్లో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here