శ్రీకాంత‌చారికి బీజేవైఎం రాష్ట్ర నాయ‌కుడు రాగిరి సాయిరాంగౌడ్ నివాళి

హైద‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో ప్రాణ త్యాగం చేసిన విద్యార్థి నాయ‌కుడు శ్రీ‌కాంత చారికి బీజేవైఎం రాష్ట్ర నాయ‌కుడు రాగిరి సాయిరాంగౌడ్ నివాళులు అర్పించారు. గురువారం అసెంబ్లీ ప‌రిస‌రాల్లోని గ‌న్‌పార్కులో అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద శ్రీ‌కాంత చారి చిత్ర‌ప‌టానికి ఆయ‌న పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా సాయిరాంగౌడ్ మాట్లాడుతూ శ్రీ‌కాంత చారి త‌న తోటి విద్యార్థి అని తెలిపారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మంలో ప్రాణ త్యాగం చేసినందుకు శ్రీ‌కాంత చారిని యావ‌త్ తెలంగాణ ప్ర‌జానీకం ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటుంద‌ని అన్నారు. అత‌ను చేసిన త్యాగం వెలక‌ట్ట‌లేనిద‌న్నారు.

శ్రీ‌కాంత‌చారి చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న బీజేవైఎం రాష్ట్ర నాయ‌కుడు రాగిరి సాయిరాంగౌడ్
శ్రీ‌కాంత‌చారి ఆత్మ‌త్యాగం చేసుకున్న చిత్రాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న సాయిరాంగౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here