చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్‌లోని శిల్పా ఎన్‌క్లేవ్‌లో ఉన్న విశాఖ శ్రీ శారదా పీఠ పరిపాలిత శ్రీలక్ష్మీ గణపతి దేవాలయంలో గురువారం సంకష్టహర చతుర్థి సందర్బంగా ఉదయం 8 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి స్వామికి పంచామృతాభిషేకం, అర్చన, ఉదయం 10 గంటలకు శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ది బుద్ది సమేత శ్రీ వర సిద్ది వినాయక స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.