చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ఆ పార్టీ రాష్ట్ర విపత్తుల నివారణ కమిటీ కన్వీనర్ కసిరెడ్డి భాస్కరరెడ్డి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి లు అన్నారు. ఆదివారం చందానగర్ డివిజన్ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ.. గతంలో బీజేపీ గెలిచిందని, ఈసారి చతుర్ముఖ పోటీలో అత్యంత మెరుగైన అవకాశాలు బీజేపీకే ఉన్నాయని, విద్యావంతులు బీజేపీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని అన్నారు. ఓటరు ఎన్‌రోల్మెంట్ పెద్ద ఎత్తున చేయించాలని, విద్యావంతులు బూత్ వరకు వచ్చి ఓటు వేసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర స్పోర్ట్స్ సెల్ జాయింట్ కన్వీనర్ నూనె సురేందర్, రాష్ట్ర సైనిక విభాగం జాయింట్ కన్వీనర్ నాగం రాజశేఖర్ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షుడు రాకేష్ దూబే, ఉపాధ్యక్షుడు పగడాల వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ముదిరాజ్, లలిత, శోభా దూబె, శ్రీనివాస్ గుప్తా, అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.