నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల ముందస్తు ఏర్పాట్లను సమీక్షించేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చిన బిజెపి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ కు బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి విచ్చేసిన తెలంగాణ బిజెపి పార్టీ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ ను శంషాబాద్ విమానాశ్రయంలో వీరేందర్ గౌడ్, శృతి బంగారు తో కలిసి రవికుమార్ యాదవ్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న జాతీయ వర్గ సమావేశాలలో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమీత్ షా, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులకు , కేంద్రమంత్రులకు, ముఖ్యమంత్రులకు, మంత్రులకు, నాయకులకు, అతిరథ మహారథులకు ఎయిర్ ఫోర్టుకు రానున్న సందర్భంగా అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.