శేరిలింగంపల్లిలో కాషాయ జెండా ఎగరాలి – అసెంబ్లీ ముఖ్యనాయకుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతీ డివిజన్ లో పెండింగ్ లో ఉన్న బిజెపి అనుబంధ కమిటీలు, మోర్చా కమిటీలు, పోలింగ్ బూత్, శక్తి కేంద్ర కమిటీలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి సూచించారు. లింగంపల్లి విద్యానికేతన్ స్కూల్ లో రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అధ్యక్షతన బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో శేరిలింగంపల్లి అసెంబ్లీలో అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపు మేరకు ఏప్రిల్ 6న బిజెపి వ్యవస్థాపక దినోత్సవం నుండి ఏప్రిల్ 14 భారతరత్న డా.బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని ప్రతీ శక్తి కేంద్రం, పోలింగ్ బూత్ ల వారీగా కార్యక్రమలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో అభ్యర్థి గెలుపే లక్ష్యంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎమ్. జ్ఞానేంద్ర ప్రసాద్, బిజెపి రాష్ట్ర నాయకులు గజ్జల యోగానంద్, మువ్వ సత్యనారాయణ, కొరదాల నరేష్, బిజెపి దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, బిజెవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ గౌడ్, బిజెపి సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు డి.ఎస్.ఆర్. కే. ప్రసాద్, బిజెపి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, బిజెపి మాదాపూర్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు, శ్రీధర్ రావు, మాణిక్యా రావు, రాంరెడ్డి, రాజు శెట్టి, కృష్ణ ముదిరాజ్, వినయ్, మనోహర్, హరి కృష్ణ, బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, నరేందర్ ముదిరాజ్, స్వామి గౌడ్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here