నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్‌గా మియాపూర్ డివిజన్ దీప్తీశ్రీనగర్ ప్రాంతానికి చెందిన కె. రాఘవేందర్ రావు నియమితులయ్యారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రవ్యాప్తంగా 80 నియోజకవర్గాలకు సంబంధించిన కన్వీనర్ల పేర్లను ప్రకటించగా శేరిలింగంపల్లి నుంచి రాఘవేందర్ రావుకు ఆస్థానం దక్కింది. ఆయన గతంలో శేరిలింగంపల్లి మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల జిహెచ్ఎంసి ఎన్నికల్లో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్‌గా బరిలో నిలిచి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు. తనపై నమ్మకం ఉంచి శేరిలింగంపల్లి కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాఘవేందర్ రావు నియామకం పట్ల శేరిలింగంపల్లికి చెందిన ఆ పార్టీ నేతలు పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.