సర్దార్ సర్వాయి పాపన్న 371వ‌ జయంతి ఉత్స‌వాల పోస్ట‌ర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 371 జయంతి ఉత్స‌వాలను విజ‌య‌వంతం చేయాల‌ని జై గౌడ్ జాతీయ అధ్య‌క్షులు వ‌ట్టికూటి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు. ఆగ‌స్ట్ 8వ తేదీన రవీంద్ర భార‌తీలో జ‌రుగ‌నున్న సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ 371 జయంతి ఉత్స‌వాల పోస్ట‌ర్‌ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధ‌వారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ బ‌హుజ‌నుల ఆరాధ్య దైవం స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న అని కొనియాడారు. బ‌డుగు బలహీన వ‌ర్గాల కోసం ఆయ‌న చేసిన పోరాటం మ‌రువ‌లేన‌ద‌ని అన్నారు. ఆయ‌న జ‌యంతి ఉత్స‌వాల పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ్ రాష్ట్ర యువజన కార్యదర్శి గణపురం అరుణ్ గౌడ్, జై గౌడ రాష్ట్ర కార్యదర్శి వీరవల్లి దివాకర్ గౌడ్, ఇతర గౌడ ప్ర‌ముఖులు పాల్గొన్నారు.

ఉత్స‌వాల ఆహ్వాన ప‌త్రిక‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అంద‌జేస్తున్న వ‌ట్టికూటి రామారావు గౌడ్‌, అరుణ్ గౌడ్‌, దివాక‌ర్ గౌడ్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here