నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ ఆర్ బి ఆర్ కాంప్లెక్స్ లో డివిజన్ అధ్యక్షులు మణిక్ రావు ఆధ్వర్యంలో డివిజన్ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, రాష్ట్ర నాయకులు యోగానంద్, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం అని అన్నారు. అలాగే సంస్థాగత విషయాలు ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు పట్ల మియాపూర్ డివిజన్ నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బుచ్చిరెడ్డి, డి ఎస్ ఆర్ కె ప్రసాద్, డివిజన్ ఇంచార్జి రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాఘవేంద్రరావు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.