పేద‌ల కోసం ప‌నిచేసేది తెరాస పార్టీయే : ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

వివేకానంద‌న‌గ‌ర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పేద‌ల కోసం ప‌నిచేస్తున్న ఏకైక పార్టీ తెరాస అని ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ అన్నారు. వివేకానంద‌న‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని వెంక‌టేశ్వ‌ర న‌గ‌ర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్, సుధాకర్, ఎర్ర లక్ష్మయ్య, సిద్దయ్య, రవి సాగర్, బంటి, అంజలి, సిద్దిరాములు, రాంనర్సయ్య, దుర్గారావు, బాబు, అశోక్, ప్రవీణ్, యాదయ్య, మారుతి, మ‌రో 100 మంది నాయ‌కులు డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి రోజా రంగరావు ఆధ్వ‌ర్యంలో ఆరెక‌పూడి గాంధీ స‌మ‌క్షంలో తెరాస‌లో చేరారు. వారంద‌రికీ గాంధీ తెరాస కండువాలు క‌ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

తెరాస‌లో చేరిన నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ

ఈ సంద‌ర్భంగా ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ.. అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు తెరాస‌కే ఉంద‌న్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో తెరాస అభ్య‌ర్థులు స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌ని, మేయ‌ర్ పీఠాన్ని సొంతం చేసుకుంటామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. తెరాస అభ్య‌ర్థులు భారీ మెజారిటీతో గెల‌వ‌బోతున్నార‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకుడు ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here