ప్రజల మద్దతుతో చెరువులను కాపాడుకుంటాం – మియాపూర్ పటేల్ చెరువును సందర్శించిన బిజెపి నాయకులు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కబ్జాలకు గురవుతున్న చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. బిజెపి రాష్ట్ర‌ కమిటీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో కబ్జాలకు గురవుతున్న చెరువులను, నాలాలను సందర్శించడంలో‌ భాగంగా మియాపూర్ లోని పటేల్ చెరువును బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ శాఖ, రాష్ట్ర నాయకులు సందర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో దాదాపు 70 నుంచి 80 గొలుసుకట్టు చెరువులు ఉండగా దాంట్లో మియాపూర్ అతి పెద్ద చెరువు అని అన్నారు. గత మూడేళ్ల కిందటే సుందరీకరణ పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. నిధులున్నా చెరువులు అభివృద్ధికి ‌నోచుకోక పెద్ద వర్షాలు వచ్చినా నీటి నిల్వ లేకుండా ఖాళీగా కనిపిస్తున్నాయని బిజెపి నాయకులు వాపోయారు.

మియాపూర్ పటేల్ చెరువును సందర్శిస్తున్న బిజెపి నాయకులు

గ్రౌండ్ లెవల్ లో నీరు లేక తాగునీటి సమస్యల‌ కోసం ఎంతో మంది ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందారు. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి పనులు యుద్ధ ప్రాతిపదికగా చేపట్టి చెరువులను నిండు కుండలా ఉంచేలా చేయాలన్నారు. చుట్టు పక్కల చెరువులు, నాలాలు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారన్నారు. రాబోయే రోజుల్లో పటేల్ చెరువును కబ్జాల కోసం సుందరీకరణ చేయకుండా ఉంచారా అనే ప్రశ్నించారు. చెరువులను రక్షించాలని బిజెపి తరపున డిమాండ్ చేశారు. ప్రజల మద్దతుతో చెరువుల రక్షణపై అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్, జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, రాష్ట్ర నాయకులు యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, నరేష్, ప్రభాకర్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు బుచ్చి రెడ్డి, నాగేశ్వర్ గౌడ్, మాణిక్ రావు, హరికృష్ణ, శ్రీధర్ రావు, రాజుశెట్టి, ఆంజనేయులు, రాంరెడ్డి, మహిపాల్ రెడ్డి, మనోహర్, రాఘవేందర్ రావు, మహేష్ యాదవ్, కసిరెడ్డి సింధు, జితేందర్, వర లక్ష్మీ, హనుమాన్ నాయక్, విజేందర్, హరిప్రియ, విజయలక్ష్మి, చంద్రమోహన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పటేల్ చెరువును పరిశీలిస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here