నమస్తే శేరిలింగంపల్లి:హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండలం శ్రీరాములపేట వార్డ్ బస్తీల్లో, తదితర ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ కు మద్దతుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈటల రాజేందర్ కు ఓటేసి గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి కమలం గుర్తుకు ఓటెయ్యాలని కోరినట్లు జ్ఞానేంద్రప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు శ్రీధర్ రావు, రాజుశెట్టి, రవి గౌడ్, శ్రీకాంత్, నవీన్, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.