నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయ రజితోత్సవాలలో భాగంగా తెలంగాణ దక్షణ మండలి విద్యుత్ సంస్థ పోర్మెన్ కూర్మ వెంకటేశ్వర్లును విశాఖ శారదా పీఠం ఉత్తరపీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఆలయ పాలక మండలి ఘనంగా సత్కరించారు. ఉత్సవాల సమయంలో వెంకటేశ్వరాలయ సముదాయానికి విద్యుత్ సరఫరాలో ఏలాంటి అంతరాయాలు లేకుండా, ఒకవేళ అంతరాయం ఏర్పడినా వెంటనే అధిగమించి నిరంతర సేవలందిస్తున్నందుకు ఆలయ పాలక మండలి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వృత్తి ధర్మంతో పాటు స్వామివారి కార్యంలో భాగస్వాములవ్వడం తమ అదృష్టంగా బావిస్తున్నామని, తమ సేవలను గుర్తించి ప్రోత్సహిస్తున్న ఆలయ పాలక మండలి సభ్యులు, ఆశీర్వదించిన స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతికి, ఆలయ ప్రధానార్చకులు శ్రీ సుదర్శనం సత్యసాయి ఆచార్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.