దళితులను మోసం చేస్తున్న కేసీఆర్: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర దళిత మోర్చా ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో శుక్రవారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన బడుగుల ఆత్మగౌరవ పోరుకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ‌నియోజకవర్గం బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జ్ఞానేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులకు మూడెకరాల భూమి, గిరిజనుల పోడు భూములకు పట్టాలు, బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బడుగుల ఆత్మగౌరవ పోరును చేపట్టినట్లు చెప్పారు. దళిత బంధు పేరిట రూ.10 లక్షలిస్తానని కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చేసిన హామీని గాలికి వదిలేశాడని, ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో దళితుడికి రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను మోసం చేస్తూ కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నాడని అన్నారు. తెలంగాణలో 2023లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ రావు, మణిక్ రావు, రాంరెడ్డి, విజేందర్, ప్రభాకర్, రవీందర్, సిద్దు, శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

బడుగుల ఆత్మగౌరవ పోరుకు బయల్దేరిన బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here