ప‌వ‌ర్‌, కేబుల్‌ బిల్లు క‌ట్టి వ‌స్తాన‌ని వెళ్లి యువ‌కుడు అదృశ్యం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప‌వ‌ర్‌, కేబుల్‌ బిల్లు క‌ట్టి వ‌స్తాన‌ని వెళ్లిన యువ‌కుడు అదృశ్య‌మైన సంఘట‌న చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మ‌ద్‌పాషా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… పాపిరెడ్డి కాల‌నీలో నివాసం ఉండే కేశ‌మ్మ‌కు ఇద్ద‌రు కుమారులు. ఈ నెల 27న ఆమె పెద్ద కుమారుడు వేముల రాజేష్‌(21) ప‌వ‌ర్‌, కేబుల్ బిల్లులు క‌ట్టి వ‌స్తానంటు రూ.4 వేలు తీసుకుని వెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన రాజేష్ శుక్ర‌వారం వ‌ర‌కు తిరిగి రాలేడు. స్నేహితులు, బంధువులు, తెలిసిన వారి వ‌ద్ద ఆరాతీసిన రాజేష్ జాడ తెలియ‌క పోవ‌డంతో చందాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ధ‌ర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ ఆచూకీ తెలిసిన వారు ఫోన్ నెంబ‌ర్ 9491039027, 790113092, 8008029073, 9490617100 ల‌లో స‌మాచారం అందించాల‌ని పోలిసులు ఎస్ఐ అహ్మ‌ద్‌పాషా సూచించారు.

వేముల రాజేష్‌chandachanda
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here