నమస్తే శేరిలింగంపల్లి: మృధు స్వభావి, నిరంతర నిస్వార్థ సేవా గుణశాలి, ప్రజా సేవకుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేందర్ ప్రసాద్ మృతి పట్ల భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ(ఐక్య), ఎంసీపీఐయూ, అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం ఏఐసీటీయూ సంతాపం ప్రకటించాయి. మియాపూర్ లోని శ్రీకర హాస్పిటల్ లోని జ్ఞానేంద్ర ప్రసాద్ భౌతిక కాయాన్ని సందర్శించి అకాల మరణానికి సంతాపాన్ని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సంతాపం తెలిపిన వారిలో ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ తుడుం అనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె మురళి, ఎం.రమేష్, అంగడి పుష్ప, భాగ్యమ్మ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్స్ లాసాని రాజు, దశరత్ నాయక్, కర్ర దానయ్య, నాయకులు కే .రాజు, లక్ష్మణ్, దేవేందర్, ఎం.ఏ నగర్ బస్తీ నాయకులు కె. రవి, డి. రాజు తదితరులు ఉన్నారు.