ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేయాలి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా గణేష్ విగ్రహాలను ట్యాంకుబండ్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ జ్ఞానేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. గణేష్ నిమజ్జనం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జ్ఞానేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై ప్లకార్డులతో బిజెపి నాయకులు , సంఘ్ పరివార్ సంస్థలు, హిందూ సంఘాలు, ఉత్సవ సమితి సభ్యులు గురువారం ధర్నా చేపట్టారు‌. ఈ ఏడాది ట్యాంకుబండ్ లో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్యాంకుబండ్ లో విగ్రహాలను నిమజ్జనం చేయరాదని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో భక్తుల విశ్వాసాలను గౌరవించి, హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించకపోవడం వలనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిజానిజాలు తెలిపి, ప్రభుత్వ ఆర్డినెన్స్ తీసుకువచ్చి ట్యాంకుబండ్ లో గణేష్ నిమజ్జనోత్సవాన్ని యధావిధిగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈనెల 19వ తేదీ అనంత చతుర్దశి రోజున సామూహిక వినాయక నిమజ్జనం కోసం మండప నిర్వాహకులు తరలివచ్చి హిందువుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. బిజెపి సీనియర్ నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి, గోవర్ధన్ గౌడ్, జానకి రామరాజు, రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఏ పండగలకు లేని ఆంక్షలు హిందువుల పండగలకే రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పోరెడ్డి బుచ్చి రెడ్డి, డి ఎస్ ఆర్ కె ప్రసాద్, వెంకట్ మారం, మహిపాల్ రెడ్డి, నరేందర్ ముదిరాజ్, రాంరెడ్డి, సింధు రెడ్డి, శ్రీధర్ రావు, మాణిక్ రావు, రాజు శెట్టి, కమలాకర్, నవీన్ గౌడ్, ఏకాంత్ గౌడ్, జితేందర్, మేరీ, వినిత సింగ్, రాజ్ జస్వాల్, భజరంగ్ దళ్ నాయకులు బాలాజీ, హరి, ఠాకూర్, సంఘ్ పరివార్ సంస్థ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

చందానగర్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టిన బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here