నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ ప్రజలకు సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు.శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ లో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని కాంట్రాక్టర్ సూచించారు. కాలనీ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బాపునగర్ మసీదు సదర్ సలీం, జనరల్ సెక్రటరీ యూసుఫ్, రాజ్ కుమార్, గోపాల్ యాదవ్, యాదగిరి, బసవరాజు, నర్సింహ, రామచందర్, నర్సింహరెడ్డి, జమ్మయ్య, హాబీబు, బక్షు భాయ్, షేక్ మొహ్మద్, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.