సామాజిక సేవా దృక్పథం కలిగిన నాయకుడు వాసిలి: బాలింగ్ గౌతమ్ గౌడ్

చంద్రశేఖర్ ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న బాలింగ్ గౌతమ్ గౌడ్

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొంటూ, సామాజిక సేవలో సైతం తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అని హఫీజ్ పేట డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. మంగళవారం టిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు వాసిలి చంద్రశేఖర ప్రసాద్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ వాసిలి చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని, తాజాగా మంత్రి కేటీఆర్ పిలుపుతో కరోనా వ్యాధిగ్రస్తుల నిమిత్తం ఏర్పాటు చేస్తున్న అంబులెన్స్ నిర్మాణానికి ముందుకు వచ్చి 20 లక్షల రూపాయలను అందజేశారన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమ నాయకులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు వాసిలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాలా హరీష్ రావు, మిద్దెల మల్లారెడ్డి, తిరుమలేష్, జ్ఞానేశ్వర్, గణేష్ రెడ్డి, ప్రశాంత్ వెంకటేష్, శ్రీకాంత్, పాల్గొన్నారు.

వాశిలి చంద్రశేఖర ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలువుతున్న టిఆర్ఎస్ నాయకులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here