నమస్తే శేరిలింగంపల్లి: ఆదివాసీల హక్కుల కోసం ఆంగ్లేయులను ఎదురించిన స్వాంతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా అని, ఆ మహనీయుడి జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని నడిగడ్డ తండాలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ బిర్సా ముండా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని, గిరిజనుల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చరిత్రలో సమున్నత స్థానం కల్పించేందుకు, భావితరాలకు స్ఫూర్తిని నింపేందుకు భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ్ దివస్ గా నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు బిర్సా ముండా అని అన్నారు. 19వ శతాబ్దపు చివరి రోజుల్లో, నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో, బ్రిటిషు కాలంలో జరిగిన మిలీనేరియన్ ఉద్యమానికి సారథ్యం వహించారని అన్నారు. తద్వారా భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడని అన్నారు. వీరి గౌరవార్థం భారత పార్లమెంటులోని సెంట్రల్ హాల్ లో ముండా చిత్రపటం ఉందని అన్నారు. ఈ విధంగా సత్కరింపబడిన ఏకైక ఆటవిక జాతుల నాయకుడు బిర్సా ముండా అని అన్నారు. బ్రిటిషు వలసవాదంపై తిరుగుబాటుగా సాగిన భారతీయ స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న యోధునిగా బిర్సా ముండా పేరును అత్యంత గౌరవంతో ప్రస్తావిస్తారని అన్నారు. కార్యక్రమంలో ఎస్టీ మోర్చా నాయకులు హనుమాన్ నాయక్, డివిజన్ అధ్యక్షులు మాణిక్ రావు, శ్రీధర్ రావు, నాయకులు రవీందర్ నాయక్, రవి గౌడ్, వర ప్రసాద్, లక్ష్మణ్, రామకృష్ణ, రత్నకుమార్, చందు, ఆంజనేయులు, విజేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.