నమస్తే శేరిలింగంపల్లి: భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అకాల మరణం తీరని లోటని ఏఐబీఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరత్ నాయక్ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ లో అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి గిరిజన నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఏఐబీఎస్ఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ దశరత్ నాయక్ మాట్లాడుతూ భారత తొలి సిడిఎస్ రంగంలో అత్యంత శక్తివంతమైన సైనిక అధికారిగా గుర్తింపు పొందిన భారత చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ అకాల మరణం భారత దేశానికి తీరని లోటని అన్నారు. భారతమాత యుద్ధవీరుడు భారతదేశానికి ఎన్నో సేవలు అందించిన గొప్ప సైనిక దళపతి 4 దశాబ్దాలకు పైగా భారతమాత సేవలో తరలిస్తున్న మేరునగ శిఖరం కూలిపోయిందని వాపోయారు. ఆయనతో పాటు 11 మంది వీర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తాండ నాయకులు సీతారాం నాయక్, చందుయాదవ్, హరి నాయక్, గోపినాయక్, రాఘవేందర్, చింతయ్య, ఆర్ హరి, హనుమంతు, జస్వాల్ తదితరులు పాల్గొన్నారు.