నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో బీహార్ క్రాప్ట్ ఫెయిర్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. క్రాప్ట్ ఫెయిర్ లో చేనేత కళాకారులు తయారు చేసిన వివిధ రకాల చేనేత హస్తకళా ఉత్పత్తులను మహిళలను ఆకట్టుకోవడంతో పలు రకాల వస్తువులను ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. భారతి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, బీహార్ రాష్ట్రానికి చెందిన జానపద కళాకారుల నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
