శేరిలింగంపల్లి, ఏప్రిల్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ప్రజలందరూ భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భూసమస్యలకు పరి ష్కారం లభిస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి నర్సింహ రెడ్డి అన్నారు. జోనల్ కార్యాలయంలో భూభారతి పై రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఎం.ఆర్.ఓ, శేరిలింగంపల్లి కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి జగదీశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, ఈ చట్టంతో సమస్యలను డివిజన్, మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు. ధరణి భూతాన్ని బంగాళాఖాతంలో కలిపి కొత్త భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు అలీ, జహంగీర్, నాయకులు కట్ల శేఖర్ రెడ్డి, మహిళ కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు సునీత ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సౌందర్య రాజన్, నాయకులు జవీద్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.