శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): రాజ్యసభ మెంబర్ మందాడి అనిల్ కుమార్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దామాషా పద్ధతిన రిజ ర్వేషన్ కల్పించాలని అన్ని కులాలకు వెనుకబడిన వర్గాలకు విద్య వైద్యం రాజకీయం ఉద్యోగాలలో మరియు అన్ని రంగాలలో బీసీ రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వెనుకబడిన వర్గాలకు రాజకీయవాటా కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఇప్పటికీ యాదవులకు బీసీలకు సముచిత స్థానం దక్కట్లేదు అని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ అన్నారు.కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది యాదవులు బీసీలు పార్టీకి పనిచేస్తూ ఉన్నారు, పార్టీని నమ్ముకుని ఉన్నారు. వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బీసీ ఐక్యవేదిక తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం అని అన్నారు.చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అందేలా కుమార్ యాదవ్, రాజేందర్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.