శేరిలింగంపల్లి, డిసెంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నందమూరి నగర్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్ లో మెడికోవర్ హాస్పిటల్ సౌజన్యంతో BIG టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు, హాస్పిటల్స్ ఇలా ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజలు ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, MD ఇబ్రహీం, అష్రాఫ్, ఖదీర్, యాసీన్, సదామహేష్, జుబేదా బేగం, విమల , స్వప్న, బిజన్ బి, పర్వీన్ బేగం, సంగన్న, మహమ్మద్ ఖురేషి, శబద్దీన్, ఖురేషి , సాధిర్, అబ్బాస్, వైద్య సిబ్బంది , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2024/12/09a.jpg)