శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.2,10,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను బాధిత కుటుంబాలకి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.