నమస్తే శేరిలింగంపల్లి: జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలన్నా, అభివృద్ధి చెందాలన్నా గురువు పాత్ర ఎంతో ముఖ్యమని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు. భేల్ ఎంఐజి కాలనీలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులను కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన సనాతన ధర్మం జన్మనిచ్చిన తల్లిదండ్రులకు సమానంగా గురువుకి కూడా సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందని అన్నారు. విద్యార్థుల ఎదుగుదల కోసం నిరంతరం శ్రమించి, వారిని వృద్ధి లోకి తీసుకువచ్చే ఉపాధ్యాయుల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ రామస్వామి యాదవ్, మహిళా సంఘాల నాయకులు రాణి, జ్యోతి, అన్నపూర్ణ, రాధ, రామ లక్ష్మీ, వినోదా, శ్రీదేవీ, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.