ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 134వ జయంతిని పురస్కరించుకొని 60 వ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చందానగర్ లోని అన్నపూర్ణ ఎన్ క్లేవ్ లో లయన్స్ క్లబ్ మెగా సిటీ, పోలా రంగనాయకమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 20 మంది ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను శాలువా, మెమొంటో అందజేసి పగిడిలతో సత్కరించారు. లయన్స్ క్లబ్ మెగా సిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, సత్యనారాయణ, కోటేశ్వరరావు, చిన్నారెడ్డి, అంతిరెడ్డి, విద్యాసాగర్, మల్లారెడ్డి, జైపాల్ రెడ్డి, సుధాకర్, పోలా రంగనాయకమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పబ్బ శ్రీనివాస్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. సన్మాన గ్రహీతలుగా ఎంపికైన ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఏ. సంపత్ కుమార్, వాణి, రమాదేవి, శైలజ, భవాని, శ్రీధర్ గౌడ్, విఠల్, చంద్రశేఖర్, గోవింద్, రామలక్ష్మీ, కల్పన, చంద్రశేఖర్ తదితరులకు‌ సన్మాన పత్రం అందజేసి ఘనంగా సన్మానించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here