వరుస వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: వాతావరణ శాఖ సూచన ల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలందరూ అప్రమత్రంగా ఉండాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రావద్దన్నారు. విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి తదితర ఎలాంటి ఇబ్బందులు కలిగినా‌ వెంటనే సంబంధిత అధికారులకు గాని, స్థానిక ప్రజాప్రతినిధులకు గాని సమాచారం అందించాలని సూచించారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అధికారులు, మాన్ సున్ ఎమర్జెన్సీ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here