శేరిలింగంప‌ల్లిలో భార‌త్ బంద్ సంపూర్ణం.. ప్ర‌శాంతం..

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల అమ‌లులోకి తెచ్చిన నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన భార‌త్ బంద్ ప్ర‌శాంతంగా, సంపూర్ణంగా కొన‌సాగింది. ప్ర‌జ‌లు, వ్యాపార సంస్థ‌లు స్వ‌చ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. తెరాస పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధులు, నాయ‌కులు ప‌లు చోట్ల రాస్తారోకోలు, ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. కేంద్రం అమ‌లు చేస్తున్న నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

మియాపూర్‌లో…
మియాపూర్ లో జాతీయ రహదారిపై స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్ర‌ధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని లేనియెడల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పురుషోత్తం యాదవ్, బండారు మోహన్ ముదిరాజ్, అన్వర్ షరీఫ్, గంగాధరరావు, మహేందర్ ముదిరాజ్, మాధవరం గోపాల్ రావు, ప్రతాప్ రెడ్డి, రాజేష్ గౌడ్, కిరణ్ యాదవ్, గణేష్ ముదిరాజ్, వరలక్ష్మి, జహీరుద్దీన్ పాల్గొన్నారు.

మియాపూర్ జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించి ఆందోళ‌న చేస్తున్న చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

బంద్‌లో పాల్గొన్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ…
భార‌త్ బంద్‌కు మ‌ద్ద‌తుగా కూక‌ట్‌ప‌ల్లిలోని ఉషా ముళ్ళపూడి కమాన్ కూడలి వద్ద కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో క‌లిసి ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. అదేవిధంగా హైద‌ర్‌న‌గ‌ర్‌లో 45వ నంబ‌రు జాతీయ ర‌హ‌దారిపై ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్లు దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌, నార్నె శ్రీ‌నివాస‌రావులతో క‌లిసి తెరాస నాయ‌కులు, కార్య‌క‌ర్తలు రాస్తారోకో నిర్వ‌హించి ఆందోళ‌న చేప‌ట్టారు.

కూక‌ట్‌ప‌ల్లిలోని ఉషా ముళ్ళపూడి కమాన్ కూడలి వద్ద ర‌హ‌దారిపై ప‌డుకుని నిర‌స‌న తెలుపుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
హైద‌ర్‌న‌గ‌ర్ వ‌ద్ద జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించిన ఎంపీ రంజిత్ రెడ్డి, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్లు దొడ్ల వెంక‌టేష్ గౌడ్‌, నార్నె శ్రీ‌నివాస‌రావు

గ‌చ్చిబౌలిలో…
గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని గ‌చ్చిబౌలి ప్ర‌ధాన ర‌హ‌దారిపై మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వ‌ర్యంలో రాస్తారోకో నిర్వ‌హించారు.

గ‌చ్చిబౌలిలో ర‌హ‌దారిపై బైఠాయించి నినాదాలు చేస్తున్న కొమిరిశెట్టి సాయిబాబా

శేరిలింగంప‌ల్లిలో…
రైతు వ్యతిరేక విదానాలను మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేపట్టిన‌ భారత్ బంద్ కు ‌ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మేరకు శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో వర్తక వ్యాపార సముదాయాలను, దుకాణాలను బంద్ చేయించి సంపూర్ణ బంద్ ను పాటించారు. గుల్ మోహర్ సర్కిల్ వద్ద, బీహెచ్ఎల్ లింగంపల్లి చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాగం నాగేందర్ యాదవ్ రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. రాస్తారోకోలో టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఉపాధ్యక్షుడు యాదాగౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ, నాయకులు‌ కలివేముల వీరేశం గౌడ్, బసవయ్య, దుర్గా రెడ్డి, నవీన్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, గోపాల్, శ్రీకాంత్ యాదవ్, గోపీ, పవన్, దేవులపల్లి శ్రీకాంత్, మహేందర్ సింగ్, పట్లోళ్ల నర్సింహా, జమ్మయ్య, సాయి, సబియా, రవీందర్, సుధాకర్ పాల్గొన్నారు.

తారానగర్ మార్కెట్ లో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రాస్తారోకో

మాదాపూర్‌లో…
మాదాపూర్ లోని సైబ‌ర్ ట‌వ‌ర్స్ వ‌ద్ద ర‌హ‌దారిపై ప్రభుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, డివిజ‌న్ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌లు ఆందోళ‌న చేప‌ట్టారు. ర‌హ‌దారిపై బైటాయించి నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు.

సైబ‌ర్ ట‌వ‌ర్స్ వ‌ద్ద ర‌హ‌దారిపై బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్న ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
సైబ‌ర్ ట‌వ‌ర్స్ వ‌ద్ద మొక్క‌జొన్న మొక్క‌ల‌తో నిర‌స‌న తెలుపుతున్న కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

హ‌ఫీజ్‌పేట‌లో…
హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని జాతీయ ర‌హ‌దారిపై డివిజ‌న్ కార్పొరేట‌ర్ పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేప‌ట్టారు.

హ‌ఫీజ్‌పేటలో జాతీయ ర‌హ‌దారిపై కార్పొరేట‌ర్ పూజిత జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ఆందోళ‌న

కొండాపూర్‌లో…
కొండాపూర్ డివిజ‌న్‌లో కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వ‌ర్యంలో భార‌త్ బంద్‌లో భాగంగా ఆందోళ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఊట్ల కృష్ణ, అన్నం శశిధర్ రెడ్డి, డివిజన్ తెరాస అధ్యక్షుడు కృష్ణ గౌడ్, వార్డు మెంబర్స్ గౌరీ, జంగం గౌడ్, చాంద్ పాషా, నరసింహ సాగర్, రూప రెడ్డి, మీనా బి, శ్రీనివాస్ చౌదరి, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, ఏరియా కమిటీ మెంబర్స్ తిరుపతి, మంగమ్మ, కరీం, మహేందర్, రవి శంకర్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ భీమని శ్రీనివాస్, రాజేష్ యాదవ్, తెరాస నాయకులు అడ్వకేట్ కృష్ణవేణి, వెంకట్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అశోక్ సాగర్, హినాయత్, పూజ, లావణ్య, ఎల్లయ్య, రవి గౌడ్, నందు, తిరుపతి, రజనీకాంత్, షబ్బీర్, మహ్మద్ అలీ, కుమార్, జలీల్, ఖాజా భాయ్, అంజి, శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, స్వామి, సత్తిబాబు, బాలరాజు, శ్యామల, కిరణ్, బాలరాజు, సత్యం గౌడ్, వెంకటేశ్వర్లు, అంజ‌ద్, సంజీవ, ప్రభాకర్, పాషా, సయ్యద్ ఉస్మాన్, అబేద్ అలీ, వెంకట్ రెడ్డి, డా.రమేష్, గిరి గౌడ్, యాదగిరి, నాయుడు, గణపతి, రామస్వామి, యూత్ నాయకులు దీపక్, రఫీ, అభి, వంశీ, సిద్దు, పాషా, సాయి, అఫ్రోజ్, నరేష్ ముదిరాజ్, వినయ్ కుమార్ పాల్గొన్నారు.

కొండాపూర్‌లో నిర‌స‌న చేస్తున్న కార్పొరేటర్ హమీద్ పటేల్

చందాన‌గ‌ర్‌లో…
భార‌త్ బంద్ కార్య‌క్ర‌మంలో భాగంగా చందాన‌గ‌ర్ డివిజ‌న్‌లో ర‌హ‌దారుల‌పై ఆందోన నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ, ఎంపీ రంజిత్ రెడ్డిల‌ ఆధ్వర్యంలో మియాపూర్ చౌరస్తా వ‌ద్ద తలపెట్టిన భారత్ బంద్ కార్యక్రమానికి చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం నుంచి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు క్ ర్యాలీతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీ నారాయణ, ఉరిటి వెంకట్ రావు, గురు చరణ్ దూబే, ధన లక్ష్మీ, జనార్దన్ రెడ్డి, సుప్రజా ప్రవీణ్, అక్బర్, ఓ.వెంకటేష్, రవీందర్ రెడ్డి, పి.మల్లేశం, గోపి కృష్ణ, మిరియాల ప్రీతమ్, యూసుఫ్, దాస్, యశ్వంత్, ఉదయ్, రాజు, వెంకటేష్, రాహుల్ కుమార్, జనార్దన్, ఎండీ హమీద్, రాములు, మధు కుమార్ పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్‌లో ర‌హ‌దారిపై బైఠాయించిన కార్పొరేట‌ర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డి

వామపక్షాలు, విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో…
రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మియాపూర్ బొల్లారం చౌరస్తాలో వామపక్షాలు, విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వ‌ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంసిపిఐయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాండ్ర కుమార్, ఏఐఎఫ్‌డీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, హెచ్‌సీయూ వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

మియాపూర్ బొల్లారం చౌర‌స్తాలో కేంద్రం దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేస్తున్న వామపక్షాలు, విద్యార్థి నాయకులు

న‌డిగ‌డ్డ తండా గిరిజన సంఘం ఆధ్వ‌ర్యంలో…
మియాపూర్ బొల్లారం చౌర‌స్తాలో ర‌హ‌దారిపై న‌డిగ‌డ్డ తండా గిరిజన సంఘం నాయ‌కులు బైఠాయించి ఆందోళ‌న చేప‌ట్టారు. నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెంట‌నే కేంద్రం ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో దశరథ్‌ నాయక్, సీతారాం నాయక్, స్వామి నాయక్, కృష్ణ, తిరుపతి నాయక్, నాయక్, మధు నాయక్, రెడ్యానాయక్, రాకేష్, రవి, అబ్బాస్, సుధాకర్, మోహన్ పాల్గొన్నారు.

మియాపూర్ బొల్లారం చౌర‌స్తాలో ర‌హ‌దారిపై న‌డిగ‌డ్డ తండా గిరిజన సంఘం నాయ‌కుల‌ బైఠాయింపు

బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో…

హఫీజ్ పేట్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో మియాపూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సిద్దినబోయిన పురుషోత్తం యాదవ్, బండారు మోహన్ ముదిరాజ్, ఆర్.మల్లేష్ గౌడ్, ఎండి వజీర్ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై బైఠాయించిన బాలింగ్ గౌతమ్ గౌడ్, పురుషోత్తం యాదవ్, మోహన్ ముదిరాజ్

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here