శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 18న నిర్వహించనున్న బీసీల రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం శేరిలింగంపల్లి అధ్యక్షుడు వల్లెపు మాధవరావు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రీజన్వేషన్ లు అమలు చేయాలని కోరుతూ శనివారం నాడు తలపెట్టిన రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని అన్నారు. బీసీల వాటా దక్కే వరకు పోరాడుతామని, అడ్డుకోవాలని చూస్తున్న వారి ఆటలు కొనసాగనివ్వమని హెచ్చరించారు. ఈ బంద్ లో బిసి లందరూ స్వచ్ఛందంగా పాల్గొని తమ సత్తా చూపుదామని పిలుపునిచ్చారు. బీసీ కుల సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. మేమెంతో మాకంతా అని నినాదాలతో స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని, బీసీ బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించి రవాణా ,విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలన్నారు.






