నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రoలో వెనుక బడిన బీసీ కులాల వారందరికి బీసీ బంద్ ప్రకటించి, ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్వర్ణలత కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బందు ప్రకటించాలన్నారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి గణేష్ యాదవ్, జి.సుధాకర్ యాదవ్, భేరీ చంద్ర శేఖర్ యాదవ్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
