ఆటో‌ డ్రైవర్లను ప్రభుత్వం‌ ఆదుకోవాలి : టీటీయూసీ సమావేశంలో తీర్మాణం

నమస్తే శేరిలింగంపల్లి:కరోనా మహమ్మారి వల్ల‌ ఆటో‌ డ్రైవర్లకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి అధ్యక్షులు నల్లా సంజీవరెడ్డి పేర్కొన్నారు. శేరిలింగంపల్లిలో ఆటో యూనియన్ సభ్యుల సమావేశం జరిగింది. కరోనాతో ఆటో డ్రైవర్లు చేతినిండా పనిలేక తమ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేని స్థితికి‌ చేరుకున్నారని, ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అర్హులైన ఆటో‌ డ్రైవర్లకు ఇల్లు మంజూరు చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని సమావేశంలో తీర్మానించారు. శేరిలింగంపల్లిలో ఇదివరకు ఉన్న కమిటీని అలాగే ఉంచి చురుకైన వారిని ఎన్నుకొని కమిటీలో చేర్చుకోవాలని నిర్ణయించారు. రాబోయే రోజుల్లో టీటీయూసీ కమిటీలు వేసి యూనియన్ కార్యక్రమాలు చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండీ వహీద్ అలీ, చందానగర్ అధ్యక్షుడు ఎంహెచ్ బేగ్, మియపూర్ అధ్యక్షుడు బాబు గౌడ్, హఫీజ్ పెట్ అధ్యక్షుడు ఆయుబ్, మియాపూర్ బొమ్మరిల్లు స్టాండ్ ఈశ్వర్, మియపూర్ ఆల్విన్ అధ్యక్షుడు మెయిన్ అబ్బర్, చందానగర్ ‌బస్టాండ్ రాజు, శ్రీనివాస్, శేరిలింగంపల్లి ఆటో ట్రాలీ అధ్యక్షుడు వహీద్ అలీ, వడ్డె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here