నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం, శంకర్ నగర్ కాలనిలలో జీహెచ్ఎంసీ అధికారులతో కలసి స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ సోమవారం పర్యటించారు. ఆయా కాలనీలలో నెలకొని ఉన్న సమస్యలను స్థానికులు కార్పోరేటర్, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా నాలా నుంచి దుర్వాసన వస్తుందని, దాంతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని సమస్య తీవ్రతను వివరించారు. అదేవిధంగా భవానిపురం కాలని నుంచి అమిన్ పుర్ రోడ్డు వరకు కనేటింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ శంకర్ నగర్ భవానిపురం నాలాకు అమీన్పూర్ నుంచి వస్తున్న మురుగు జలాల నాలాకు అర్.సి.సి బాక్స్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భవానిపురం నుంచి చందానగర్‌కు రావడానికి కాలనీ వాసులు చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి నేపథ్యంలో కనెక్టింగ్ రోడ్డు వెంటనే చేపట్టాలని, దాంతో రేండు కిలోమీటర్ల దూరం తగ్గుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతీ, డీఈ రుపాదేవి, ఏఈ అనురాగ్ మహదేవ్, చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, నాయకులు రవిందర్ రెడ్డి, కోండల్, దాసు, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.