ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానానికి యోగ ఉత్త‌మమైన మార్గం: పుట్ట‌ విన‌య‌కుమార్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ప్ర‌తినిత్యం యోగ సాధ‌న చేయ‌డం ద్వారా అనేక ర‌కాల వ్యాధుల‌ను నిర్మూలించి ఆరోగ్య‌క‌ర‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చ‌ని ప‌తంజ‌లి యోగా స‌మితి శిక్షకులు యోగ శిక్ష‌కులు పుట్ట‌ విన‌య‌కుమార్ అన్నారు. సోమ‌వారం 7 వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ ఆధ్వ‌ర్యంలో యోగ శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి పుట్ట వినయ్ కుమార్ హాజ‌రై సాధ‌కుల‌తో యోగ అభ్యాసం చేయించారు.

బిజెపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో యోగ అభ్యాసం చేయిస్తున్న యోగ శిక్ష‌కుడు పుట్ట‌విన‌య‌కుమార్‌

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ యోగాస‌నాలు, వ్యాయామం, ప్రాణాయామాల‌తో పాటు జ‌ల‌, ఆహార‌, నిద్ర నియ‌మాలు పాటించిన‌ప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సోంత‌మవ‌తుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దళిత మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ , రంగారెడ్డి జిల్లా మాజీ వైస్ చైర్మెన నంద కుమార్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, డివిజన్ అధ్యక్ష్యులు రాజు శెట్టి కురుమ, బీజేవైఎం నాయకులు నీరాటి చంద్ర మోహన్, ప్రధాన కార్యదర్శులు చిట్టా రెడ్డి ప్రసాద్, సత్య కుర్మ, ఉపాధ్యక్షులు బాలరాజు, కార్యదర్శి సుర్ణ రాజు, భీమాని విజయ లక్ష్మి, భీమాని సత్య నారాయణ, ఎళ్లేష్ కురుమ, అరుణ కుమారి, అందికేరి మహేష్, గజ్జల శ్రీనివాస్, పీట్ల బసంత్, పీట్ల జగదీష్, సాయి వెంకట్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

యోగ సాధ‌న చేస్తున్న బిజెపి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here