శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న ఓటు చోరీ సిగ్నేచర్ క్యాంపెయిన్ రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందిందని, ఈ క్యాంపెయిన్‌ను ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్క లాంబా ప్రారంభించగా రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీత రావు ఆధ్వర్యంలో గాంధీ భవన్లో గత వారం భారీ ఎత్తున కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని శేరిలింగంపల్లి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ ప్రారంభించబడిందన్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే శేరిలింగంపల్లి మహిళలు 9495 సంతకాలు సేకరించి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించేలా చేశారన్నారు. ఈ విజయానికి కృషి చేసిన బ్లాక్, మండల్, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. మహిళా కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల కోసం అగ్రస్థానంలో నిలుస్తుందని, ఇలాంటి ప్రజా ఉద్యమాలకు ముందుండి పనిచేస్తుందని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కూడా ఈ క్యాంపెయిన్‌లో 19,860 సంతకాలతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినట్లు జిల్లా అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ తెలిపారు.






