నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. బసవతారక నగర్ లో ఇటీవల ఇళ్లు కోల్పోయిన బాధితులు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ సాయిబాబా ఆధ్వర్యంలో ఖాజాగూడ లోని కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా సరైన న్యాయం చేస్తానని చెప్పారు. అధైర్య పడకుండా దైర్యంగా ఉండాలన్నారు. తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తానని, ప్రతి లబ్ధిదారునికి గృహ నిర్మాణ పథకాలలో వెంటనే లబ్ది చేకూర్చేలా ఆదుకుంటామన్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ మిమ్మల్ని కలిసి మా సమస్యలు చెప్పుకుందామంటే కొంత మంది కలవకుండా చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ వద్ద వాపోయారు. దీనికి వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ గాంధీ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, ఎపుడైన కలవొచ్చు అని, స్వార్థపరుల మాటలు వినకుండా సమస్యలు చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సురేందర్, జంగయ్య యాదవ్, జగదీష్ రమేష్, కే.నాగేష్, బసవతారక నగర్ వాసులు బుచ్చన్న, రామ్, చుక్క సాయిబాబు, ఏసాఫ్, వేముల సూర్య ప్రకాష్, జంగం నాగమణి, పులి నాగాకమల, అరుణ, దేవమ్మ, భారతమ్మ, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.