నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక్ నగర్ వాసులకు తక్షణమే ఇళ్లు కేటాయించాలని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కోరారు. ఈ మేరకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఇండస్ట్రీస్ పీడీ హౌసింగ్ ఇంఛార్జీ రాజశేఖర్ రెడ్డికి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా వినతిపత్రం అందజేశారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 37 లో గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకొని నివసిస్తున్న పేదల ఇళ్లను ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేయడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరగా స్పందించి అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణ పథకాల్లో తక్షణమే ఇండ్లు కేటాయించాలని కోరారు.