మసాజ్ ముసుగులో వ్యభిచారం… లోటస్ బ్లిస్ స్పా పై పోలీసుల దాడి – ఓ నిర్వాహకుడు, ఇద్దరు విటులు అరెస్టు

నమస్తే శేరిలింగంపల్లి: మసాజ్ స్పా సెంటర్ ముసుగులో యువతులతో వ్యభిచార వృత్తి చేయిస్తున్న ఓ నిర్వాహకున్ని, ఇద్దరు విటులను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్ స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం పత్రికా నగర్ లో సుజాత అనే ఓ మహిళ లోటస్ బ్లిస్ స్పా సెంటర్ ను నిర్వహిస్తోంది. థెరపిస్టు పేరుతో ఆయా ప్రాంతాల నుంచి యువతులను రప్పిస్తూ స్పా సెంటర్ ముసుగులో వ్యబిచారం నడుపుతోంది. సైబరాబాద్ ఏహెచ్ టీయూ, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా ఆ స్పా సెంటర్ పై దాడి చేశారు. ఈ దాడుల్లో స్పా సెంటర్ లో వ్యబిచారం నడుపుతూ మరో నిర్వాహకుడు సచిన్, ఇద్దరు విటులు సతీష్ కుమార్, రాజ్ కుమార్ పాటిల్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నలుగురు బాధిత మహిళలను సంరక్షణ గృహానికి తరలించగా పరారీలో ఉన్న ప్రధాన నిర్వాహకురాలు సుజాత కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here