బ‌స‌వ‌తార‌కన‌గ‌ర్‌లో నిరుపేద‌ల‌కు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యవస‌రాల పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి బసవతారక నగర్‌లో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావ‌స‌రాల స‌రుకుల పంపిణీ కార్య్ర‌మం నిర్వ‌హించారు. మాజీ ఎమ్మెల్యే, ట్ర‌స్ట్‌ బిక్షపతి యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు, ట్ర‌స్టు కార్య‌ద‌ర్శి రవి కుమార్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డిలు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 నిరుపేద కుటుంబాలకు మంగ‌ళ‌వారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమలులో ఉన్న కారణంగా ఉపాధిలేక ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌ల‌కు తన తండ్రి పేరిట గ‌ల ట్ర‌స్టు ద్వారా తోచిన స‌హ‌కారం అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వాల‌తో పాటు స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నిరుపేద‌ల‌కు అండ‌గా నిల‌వాల్సిన అవస‌రం ఎంతైనా ఉంద‌న్నారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రతిరోజు ఆర్‌కేవై ప్రాణహేతు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామ‌ని, నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు, భోజ‌నం, మందులు పంపిణీ చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నాయకులు కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, పోచయ్య, వెంకటేష్ యాదవ్,శివ సింగ్, శంకర్ యాద, తిరుపతి, సుబ్రమణ్యం, శ్రీనివాస్, రమేష్, ప్రకాష్, విష్ణు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, సంద‌య్య మెమోరియ‌ల్ ట్ర‌స్టు చైర్మ‌న్ భిక్ష‌ప‌తియాద‌వ్‌, కార్య‌దర్శి ర‌వి కుమార్ యాద‌వ్‌, కార్పొరేట‌ర్ గంగాధ‌ర్‌రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here