నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం రంజాన్ పండగను పురస్కరించుకుని కొత్త బట్టలను కానుకగా అందజేయడం ఆనవాయితీగా మారిందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ లో పేద ముస్లింలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పంపించిన రంజాన్ కానుకలను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. కులమతాలకు అతీతంగా దసరా, క్రిస్మస్, రంజాన్ పండగలకు కొత్త బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాపునగర్ మసీదు సదర్ సలీం, జనరల్ సెక్రటరీ యూసుఫ్, వార్డు మెంబర్ ఫర్వీన్, ముంతాజ్, అరుణ, రాజ్ కుమార్, గోపాల్ యాదవ్, యాదగిరి, బసవరాజు, నర్సింహా, రామచందర్, పటోళ్ల నర్సింహరెడ్డి, జమ్మయ్య, బక్షు, షేక్ మొహ్మద్, సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.