నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఎంటమాలజీ సిబ్బందికి స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ మంగళవారం కేసీఆర్ రక్షణ కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లలలో సిబ్బందికి అవసరమైన గ్లౌజులు, రెయిన్ కోట్, సబ్బులు, లిక్విడ్స్, పలు రకాల వస్తువులను ఉంచటం జరిగిందని కార్పొరేటర్ హమీద్ పటేల్ తెలిపారు. ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్న ఎంటమాలజీ సిబ్బందికి రక్షణ కిట్లను కేసీఆర్ ప్రభుత్వం పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ కిరణ్ కుమార్ రెడ్డి, ఏరియా ఇంచార్జ్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్, సిబ్బంది పాల్గొన్నారు.