నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర లో గురువారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. చేవెళ్ల మోడల్ కాలేజ్ నుండి ఆలూరు గేట్, చిట్టపల్లి గేట్ వరకు దుబ్బాక బీజేపీ శాసన సభ్యులు రఘునందన్ రావు, బీజేపీ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలతో కలసి జ్ఞానేంద్ర ప్రసాద్ పాదయాత్రగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంగ్రామ యాత్రలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అనేక సమస్యలను బండి సంజయ్ కు విన్నవిస్తున్నారని అన్నారు.