ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న రవి కుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ “ప్రజా సంగ్రామ యాత్ర” ఆరో రోజున ఇబ్రహీంపల్లి నుండి దామరగిడ్డ చౌరస్తా, మిర్జాగుడ, బస్తేపూర్, ఖానాపూర్ గేట్ వరకు రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ త్యాగాలతో సాధించుకున్న మన రాష్ట్రం స్వార్థపరుల చేతుల్లో బందీ అయ్యిందన్నారు. ఆ సంకెళ్ళు పగులగొట్టి అమరుల ఆశయాల్ని నెరవేర్చేందుకు చేపట్టిన ఈ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ మార్పునకు నాంది అన్నారు. రాష్ట్రంలో రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని చెప్పారు. అవినీతి విముక్తి కోసం గడీల కుటుంబ పాలన నుంచి తెలంగాణను కాపాడేందుకు ప్రజా సంగ్రామ యాత్ర అన్నారు. అమరుల ఆకాంక్షలకు, ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఒక్క కుటుంబమే పాలన సాగిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్ , చందానగర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షుడు నరేందర్ ముదిరాజ్ , సీనియర్ నాయకులు వసంత్ కుమార్ యాదవ్, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, మధూ యాదవ్, నాగరాజు, నర్సింగ్ రావు, బీజేపీ ప్రముఖులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డీలతో మాట్లాడుతున్న బండి సంజయ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here